‘బ్రహ్మోత్సవం’ నుండి ఆమె ఔట్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఇంతటి సూపర్‌ హిట్‌ను అందుకున్న తర్వాత మహేష్‌బాబు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకు భారీ క్రేజ్‌ రావడం ఖాయం.

 Samantha Out From Brahmotsavam-TeluguStop.com

ఇక మహేష్‌ ఇప్పటికే శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.గత నెలలోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఎంపిక అయిన సమంతను తప్పించినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా ముగ్గురు హీరోయిన్‌లుగా సమంత, కాజల్‌, ప్రణీతలను దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఎంపిక చేయడం జరిగింది.

అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక అయ్యింది.మొదట ఈమె డేట్లు లేని కారణంగా నో చెప్పింది.

అయితే షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల ఇప్పుడు రకుల్‌ ఈ సినిమాలో చోటు సంపాదించింది.అయితే రకుల్‌ ఎంట్రీతో ఇప్పటికే ఎంపిక అయిన ఏ హీరోయిన్‌ ఔట్‌ అవుతుందా అని అంతా ఎదురు చూశారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సమంతను తప్పించారని అంటున్నారు.‘బ్రహ్మోత్సవం’లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, ప్రణీతలతో మహేష్‌బాబు రొమాన్స్‌ చేయనున్నాడు.

సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube