వృత్తి పట్ల ప్రేమ, భక్తి ఉన్నవాళ్ళే ముందంజలో ఉంటారు.ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది.
సినిమాల్లో అతి తక్కువ మంది ఉంటారు ఇలాంటి వారు .ఆ అతి తక్కువ మందినే మనం సూపర్ స్టార్స్ అంటాం.ఆ అతి తక్కువ మందిలో మన సూపర్ స్టార్ మహేష్ ఒకరు.
మహేష్ కి రెండే ప్రపంచాలు తెలుసు అంటా .ఒకటి సినిమా .ఇంకొకటి కుటుంబం.ఇటివలే ఒక టి.వి చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు మహేష్.మీరు ఎప్పటిదాకా నటిస్తారు అని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా 90 అని వెంటనే జవాబిచ్చాడు సూపర్ స్టార్.
ఎంతైనా మహేష్ కి సినిమా మీద ఉండే కసి ఈ జెనరేషన్లో ఇంకెవరికి ఉండదు అనేది అతిశయోక్తి కాదు.
అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే .ఎప్పటికపుడు సరికొత్త తరహ సినిమాలు అందివ్వడం మహేష్ కే చెల్లింది.
90 ఏళ్ల దాక నటిస్తా అన్నాడు కాబట్టి, తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆయన అభిమానుమానులకు ఎంతో ఆనందానిచ్చే వార్తా ఇది.