కథ, స్క్రీన్‌ప్లే పవన్‌ కళ్యాణ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా అభిమానులు మరియు ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.మధ్యలో ‘గోపాల గోపాల’ సినిమాతో పవన్‌ వచ్చినా కూడా అది ప్రేక్షకులకు పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వలేక పోయింది.

 Pawan To Give Story And Screenplay For Sardaar Gabbar Singh-TeluguStop.com

‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందు నుండే ‘గబ్బర్‌ సింగ్‌ 2’ సినిమా గురించిన చర్చ జరుగుతోంది.అనేక కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభంలో జాప్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయం ఒకటి మీడియా మరియు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్‌ప్లేను పవన్‌ కళ్యాణ్‌ అందిస్తున్నాడని, అలాగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పవన్‌ కను సన్నల్లోనే తెరకెక్కుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు పవన్‌ షాడో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు అనే టాక్‌ కూడా ఫిల్మ్‌ సర్కిల్స్‌ల వినిపిస్తున్నాయి.బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను పవన్‌తో కలిసి శరత్‌ మారార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube