మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’ విడుదలకు సిద్దం అవుతోంది.అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేశారు.
రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇప్పటికే వరుణ్ తేజ్ లుక్ మరియు వాయిస్‌కు మంచి మార్కులు పడుతున్నాయి.
తాజాగా ఈ టీజర్‌పై పవన్ కూడా స్పందించాడు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశ భక్తితో కూడుకున్న కథాంశంతో తెరకెక్కడం వల్ల పవన్ కళ్యాణ్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
టీజర్‌ను చూసిన పవన్ ఫుల్ హ్యాపీ అయ్యాడట.వరుణ్‌కు ఫోన్ చేసి మరీ అభినందించాడట.
బాబాయి అభినందనతో అబ్బాయి సంతోషంలో మునిగి పోయాడు.ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొదటి సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేక పోయిన వరుణ్ ఈసారైనా ఆ సక్సెస్‌ను అందుకుంటాడేమో చూడాలి.