మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.దాంతో వీరిద్దరు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఈ హీరో దర్శకుడి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడ్డాయి.దాంతో త్వరలో మరోసారి వీరిద్దరు కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారని, అయితే అది ఎప్పుడు, ఎలా అనేది మాత్రం నిర్ణయించుకోలేదు అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
‘శ్రీమంతుడు’ సినిమాతో మహేష్ బాబు హీరోగానే కాకుండా మొదటి సారిగా నిర్మాతగా కూడా సూపర్ హిట్‌ను అందుకున్నాడు.
మహేష్‌బాబుకు డబుల్ సంతోషాన్ని ఇచ్చిన కొరటాల శివ తర్వాత సినిమా ఇప్పటి వరకు ఖరారు కాలేదు.త్వరలోనే ఈయన తర్వాత సినిమా ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇక మహేష్‌బాబు ఇప్పటికే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆ తర్వాత పూరి, రాజమౌళి, త్రివిక్రమ్ ఇలా పలువురు దర్శకులకు కమిట్ మెంట్ ఇచ్చాడు.దాంతో మళ్లీ శ్రీమంతుడు రావాలంటే కనీసం సంవత్సరం నర లేదా రెండు సంవత్సరాలు అయినా ఎదురు చూడాలి.2017లో వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందేమో చూడాలి.