పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

పవన్‌ కళ్యాణ్‌ తన ఫ్యాన్స్‌కు రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా తన తాజా చిత్రం ‘సర్దార్‌’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.కొన్ని రోజుల క్రితం షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమా ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది.

 Pawan’s Sardaar First Look On Independence Day-TeluguStop.com

శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.‘పవర్‌’ ఫేం బాబీ దర్శకత్వంలో శరత్‌ మారార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గత రెండు సంవత్సరాలుగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఫస్ట్‌లుక్‌ అవ్వడంతో ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.

‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మరోసారి పోలీస్‌గా సందడి చేయబోతున్నాడు.ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ త్వరలో పవన్‌ మరియు కాజల్‌ల మధ్య కొన్ని లవ్‌ సీన్స్‌ను తెరకెక్కించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube