టాలీవుడ్ హీరోలు ఎక్కువగా సంక్రాంతి సీజన్‌ను ఇష్టపడుతూ ఉంటారు.తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి దించాలని ఉబలాట పడుతుంటారు.
ఇదే దారిలో నందమూరి హీరో బాలకృష్ణ కూడా తన పలు సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపి సక్సెస్‌ను కొట్టాడు.వచ్చే సంక్రాంతికి కూడా మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
ఈ సంవత్సరం చివర్లో వస్తుందని భావించిన ‘డిక్టేటర్’ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతికి రంగంలో దింపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘డిక్టేటర్’.
అంజలి, సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యుర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ సినిమాను కాస్త ఆస్యంగానే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.
ఈ సినిమాలో బాకృష్ణ ుక్ నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసేలా ఉంటుందని, ఎప్పుడు చూడని స్టైలిష్ లుక్‌లో బాలకృష్ణ కనిపించనున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెగ సందడి చేస్తున్నారు.







