మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత సినిమాను దాదాపుగా ఖరారు చేశాడు.గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌గా ఉన్న త్రివిక్రమ్ తర్వాత సినిమా నితిన్‌తో అని తాజాగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్, నితిన్‌ల మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే త్రివిక్రమ్, నితిన్‌ల మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇక త్రివిక్రమ్ మరో వైపు ఆ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించాడు.
అందులో భాగంగా ఈ సినిమాకు హీరోయిన్‌ను బుక్ చేశాడు.
త్రివిక్రమ్ గత చిత్రాలు ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల్లో నటించిన సమంతనే తన తాజా చిత్రానికి కూడా హీరోయిన్‌గా బుక్ చేసుకున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు నితిన్, సమంతల కాంబినేషన్‌లో సినిమా వచ్చింది లేదు.నితిన్ గతంలో ఒక సారి సమంతతో సినిమా చేసే ప్లాన్ చేశాడు కాని, అప్పుడు సమంత బిజీగా ఉండటంతో నితిన్‌కు డేట్లు ఇవ్వడం కుదరదు అని చెప్పింది.
తాజాగా త్రివిక్రమ్ కోసం సమంత ఇతర సినిమాలను సైతం వదులుకుని డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉంటుంది.వరుసగా తన మూడు సినిమాలకు సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా త్రివిక్రమ్ నిలిచాడు.
త్రివిక్రమ్‌కు సమంతపై ఉన్న అంత అభిమానం ఏంటో అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.







