మదర్‌ థెరిసా వారసురాలు కన్నుమూత

మదర్‌ థెరిసా ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆ ప్రేమమూర్తి ఎవరో వివరించాల్సిన పనిలేదు.

ఆ కరుణామయి వారసురాలైన సిస్టర్‌ నిర్మల కన్నుమూశారు.వారసురాలంటే సేవా కార్యక్రమాలకు వారసురాలని తెలుసు కదా.! మదర్‌ థెరిసా కోల్‌కతాలోని తన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి నిర్మలను వారసురాలిగా ప్రకటించారు.ప్రకటించిన కొద్దికాలానికే ఆమె ప్రభువు సన్నిధికి చేరుకున్నారు.

నిర్మల పందొమ్మిదివందల తొంభైఏడో సంవత్సరంలో మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీస్‌ సుపీరియర్‌ జనరల్‌గా ఎంపికయ్యారు.అంటే రెండో మదర్‌ థెరిసా అన్నమాట.

అప్పటి నుంచి ఆమె నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ థెరిసా లేని లోటును తీర్చారు.నేపాల్‌లోని సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నిర్మల జోషి కుటుంబం రాంచీకి వలస వచ్చారు.

Advertisement

ఆమె చాలా చిన్న వయసులోనే అంటే పదిహేడో ఏటనే క్రైస్తవ మతంలో చేరారు.అప్పటినుంచి అంకితభావంతో ప్రభువు సేవలో తరించారు.

నిర్మలకు ప్రపంచమంతా నివాళులు అర్పించింది.పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శ్రద్ధాంజలి ఘటించారు.

తెలుగు స్టాప్‌ కూడా సిస్టర్‌కు ఘన నివాళులర్పిస్తోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు