ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఎదిగిపోయారు.ప్రాంతీయ పార్టీ నాయకుడి స్థాయి నుంచి జాతీయ స్థాయికి పెరిగిపోయారు.
టీడీపీని జాతీయ పార్టీగా విస్తరించే క్రమంలో ముందుగా ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.టీడీపీని జాతీయ పార్టీగా మారుస్తున్నట్లు మహానాడులో తీర్మానం చేశారు.
ఆ వెంటనే బాబు తరపున జాతీయ అధ్యక్ష పదవి కోసం ముప్పయ్ సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.దీంతో ఆయన ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
త్వరలోనే ఆంధ్రప్రదేవ్ కమిటీకి అధ్యక్షుడిని నియమిస్తారు.బాబు అధ్యక్షతన కేంద్ర కమిటీ పనిచేస్తుంది.
ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే అది కనీసం నాలుగు రాష్ర్టాల్లో విస్తరించి ఉండాలి.టీడీపీ ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల్లో ఉంది.
దీన్ని త్వరలో తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి, ఒడిశా, అండమాన్-నికోబార్‌లకు విస్తరిస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.వచ్చే ఎన్నికల్లో, ఈలోగా జరిగే రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయవచ్చు.
అక్కడా కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు సంపాదించుకుంటనే జాతీయ పార్టీగా మనుగడ సాగించే అవకాశం ఉంటుంది.బాబు కార్యదక్షుడు కాబట్టి ఆ పని కూడా చేస్తారని ఆశించవచ్చు







