బాలయ్యకు టైటిల్‌ సెంటిమెంట్‌!

నందమూరి బాలకృష్ణ సెంటిమెంట్స్‌ను ఎక్కువగా నమ్ముతాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.వాస్తు, మంచి, చెడు అన్ని విషయాల్లోనూ బాలయ్యకు పట్టింపులు ఎక్కువే.

ఇక తన సినిమాల విషయంలో కూడా సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతూ ఉంటాడు.బాలయ్య తాజాగా 98వ సినిమా ‘లయన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా యావరేజ్‌ టాక్‌తో పర్వాలేదు అనిపించుకుంది.ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ‘లయన్‌’ సినిమాకు పాస్‌ మార్కులు వేస్తున్నారు.

ఇక బాలయ్య 99వ సినిమాకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.బాలకృష్ణ ప్రతిష్టాత్మక 99వ సినిమాను వరుస సక్సెస్‌లతో దూసుకు వచ్చిన శ్రీవాస్‌ తెరకెక్కించబోతున్నాడు.

Advertisement

స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించేందుకు శ్రీవాస్‌ సిద్దం అయ్యాడు.కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌లు ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.

ఈ సినిమా కోసం ఇప్పటికే ‘డిక్టేటర్‌’ అంటూ ఫిల్మ్‌ చాంబర్‌లో శ్రీవాస్‌ రిజిస్ట్రర్‌ చేయించాడు.అయితే తాజాగా బాలయ్య టైటిల్‌ మార్చాల్సిందిగా దర్శకుడికి సూచించినట్లుగా తెలుస్తోంది.

బాలయ్య కెరీర్‌లో సక్సెస్‌ అయిన పలు సినిమాలు సింహకు సంబంధం ఉన్న టైటిల్స్‌ను కలిగి ఉన్నాయి.దాంతో ఇప్పుడు ఈ సినిమాకు కూడా సింహ అనే పదం కలిసి వచ్చేలా పెట్టాల్సిందిగా బాలయ్య చెబుతున్నాడు.

దాంతో ప్రస్తుతం బాలయ్య చెప్పినట్లుగా టైటిల్‌ను మార్చే పనిలో దర్శకుడు పడ్డాడు.ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్‌గా నటించనుంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు