బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు తాగి కారు డ్రైవ్ చేసి ఒకరి ప్రాణం బలికొన్న విషయం తెల్సిందే.చాలా కాలంగా కోర్టులో ఆ కేసు నడుస్తూనే ఉంది.తాజాగా ఆ కేసు విచారణ పూర్తి అయ్యింది.13 సంవత్సరాలుగా విచారణ జరిపిన ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు అయిదు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు అయ్యింది.ఈరోజు సల్మాన్ ఖాన్‌కు కోర్టు శిక్షను ఖరారు చేసింది.హిట్ అండ్ రన్ కేసులో ఒకరి చావుకు కారణం అయిన సల్మాన్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బయట పడలేక పోయాడు.
సల్మాన్ ఖాన్ ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నట్లుగా చెప్పించాడు.డ్రైవర్ కూడా ఆ యాక్సిడెంట్‌కు కారణం తానే అంటూ ఒప్పుకున్నాడు.కోర్టుకు తప్పుడు సాక్షం చూపించినందుకు కూడా సల్మాన్‌పై కోర్టు సీరియస్ అయ్యింది.కోర్టు శిక్షను ఖరారు చేసిన వెంటనే సల్మాన్ ఖాన్‌ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.
ముంబై హైకోర్టులో సల్మాన్ ఖాన్ బెయిల్‌కు అప్లై చేయనున్నాడు.ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉండటంతో సల్మాన్ ఖాన్ కొన్ని రోజుల పాటు జైల్లో ఉండక తప్పని పరిస్థితి.
సల్మాన్ ఖాన్‌కు శిక్ష ఖరారు అవ్వడంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు.ఇక సల్మాన్ చేస్తున్న సినిమాలు అర్థాంతరంగా ఆగిపోనున్నాయి.
దాదాపు 200 కోట్ల సినిమాలు ప్రస్తుతం సల్మాన్ అరెస్టు వల్ల ఆగిపోనున్నాయి.







