పోలీసు డిపార్టుమెంట్‌ కక్కుర్తి...!

ప్రభుత్వ శాఖల్లో ఎంత దుబారా అవుతుందో మనకు తెలుసు.అనవసరంగా ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు.

లక్షలు, కోట్లు ఆరగించేవారికి లెక్కలేదు.ప్రభుత్వ శాఖల్లో కోట్ల రూపాయలు జమా ఖర్చల్లో కనబడవు.

అధికారంలో ఉన్న పార్టీ అయితే ప్రభుత్వ ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటుంది.అడిగే దిక్కు ఉండదు.

కాని కొద్ది మొత్తం కోసం కక్కుర్తి పడుతుంది.ప్రస్తుతం చెప్పుకునే కక్కుర్తి కథ ఛత్తీస్‌గడ్‌కు సంబంధించింది.

Advertisement

ఏం జరిగిందంటే.ఈ రాష్ర్టంలో కిషోర్‌పాండే అనే స్పెషల్‌ పోలీసు అధికారి నాలుగేళ్ల కిందట మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.

వెంటనే అంత్యక్రియల కోసం పోలీసు శాఖ తన సంక్షేమ నిధి నుంచి పదివేల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చింది.ఆ తరువాత కాంపన్సేషన్‌ కింద ప్రభుత్వం అయిదు లక్షలు ఇచ్చింది.

అయితే అంత్యక్రియల కోసం ఇచ్చిన పది వేలు దాన్నుంచి కట్‌ చేయడం మర్చిపోయారట.దీంతో ఆ పదివేలు తిరిగి ఇవ్వాలని పోలీసు శాఖ ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టింది.

నోటీసుల మీద నోటీసులు పంపుతోంది.అసలే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా పోలీసు శాఖ వేధింపులు ఎక్కువయ్యాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

దీంతో మీడియాలో దుమారం రేగింది.మావోయిస్టులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి కుటుంబాన్ని పది వేల రూపాయల కోసం వేధించమేంటని పోలీసు శాఖపై జనం దుమ్మత్తిపోశారు.

Advertisement

డబ్బు డిమాండ్‌ చేయడమంటే ఆ కుటుంబాన్ని అవమానించడమేనని రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.దీంతో ఇక బాగుండదని పోలీసు శాఖ నోరు మూసుకుంది.

మన దేశంలో త్యాగాలు చేసిన పోలీసులకు ఇచ్చే గౌరవం ఇదీ.! కోట్ల రూపాయలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం పదివేల రూపాయలను సర్దుబాటు చేయలేదా? ఇది ఛత్తీస్‌గఢ్‌ కథే కాదు.ఏ రాష్ర్ట ప్రభుత్వం తీరైనా ఇంతే ఉంటుంది.

తాజా వార్తలు