శ్రీమంతుడు లీక్‌ అయ్యాడు

మహేష్‌బాబు హీరోగా ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘శ్రీమంతుడు’.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే.

అంతా సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలోని ఒక పాట రషెస్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాడు.రెండు నిమిషాల ఈ పుటేజ్‌ ఎలా లీక్‌ అయ్యింది అనే విషయం చిత్ర యూనిట్‌కు సైతం అర్థం కాకుండా ఉంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియా నుండి ఆ ఫుటేజ్‌ను తొలగించే ప్రయత్నంను చిత్ర యూనిట్‌ సభ్యులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.గత కొంత కాలంగా టాలీవుడ్‌కు లీక్‌ల సమస్య తలనొప్పిగా మారింది.

తాజాగా మహేష్‌బాబు సినిమాలోని సాంగ్‌ బిట్‌ లీక్‌ అవ్వడంతో అంతా మరోసారి అలర్ట్‌ అయ్యారు.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమాల ఫిల్మ్‌ మేకర్స్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ తమ సినిమాలకు భద్రత కల్పిస్తున్నారు.

Advertisement

ఇక శ్రీమంతుడు విషయానికి వస్తే మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.‘మిర్చి’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి.

ఈ సినిమాను జూన్‌లో విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది.ఈ సినిమా మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు