ప్రియురాలిని ఎత్తేశాడు

టీం ఇండియా యువ కెరటం విరాట్‌ కోహ్లీ మరియు బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనుష్క శర్మలు డీప్‌గా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం గురించి తాజాగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరు కలిసి పబ్బులు, క్లబ్బులు అంటూ తెగ తిరిగారు.

 Virat Praises Anushka’s Performance In Nh10-TeluguStop.com

అయితే ప్రపంచకప్‌ నేపథ్యంలో వీరిద్దరు గత కొంత కాలంగా విడి విడిగా ఉంటున్నారు.వరుస విజయాలతో నాకౌట్‌ దశకు చేరుకున్న భారత్‌కు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం దక్కింది.

విశ్రాంతి సమయంలో ఆటగాళ్లు ఔటింగ్‌కు వెళ్లగా విరాట్‌ కోహ్లీ మాత్రం తన ప్రియురాలి తాజా చిత్రం ‘ఎన్‌హెచ్‌ 10’ సినిమా చూశాడు.

‘ఎన్‌హెచ్‌ 10’ సినిమా చూసిన విరాట్‌ కోహ్లీ అందులోని అనుష్క నటనకు ఫిదా అయ్యాడు.

నా ప్రేయసి ఆ సినిమాలో అద్బుతంగా నటించిందని, ఇలాంటి పాత్రలు స్టార్‌ హీరోయిన్స్‌ ఆసక్తిగా చేయరు, కాని అనుష్క నటనపై ఉన్న అభిమానంతో ఈ పాత్ర చేసి, పూర్తి న్యాయం చేసిందని కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.ప్రపంచ కప్‌లో విరాట్‌ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడుతుండటంతో అనుష్క కూడా ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఉంది.

త్వరలో విరాట్‌, అనుష్కల పెళ్లి జరుగనుందని మీడియాలో గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube