టాలీవుడ్‌లో పరీక్షల ప్రభావం క్లీయర్‌గా కనిపిస్తోంది.గత రెండు వారాలుగా బాక్సాఫీస్ ముందుకు పెద్ద సినిమాలు వచ్చింది లేదు.
చిన్న సినిమాలు వచ్చినా కూడా వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు.ప్రస్తుతం పరీక్షల సీజన్ అవ్వడంతో పాటు మరో వైపు ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉండటం వల్ల సినిమాలు కష్టాలు పడుతున్నాయి.
ఇటీవల విడుదలైన పలు చిన్న సినిమాలకు ప్రేక్షకులు కరువయ్యారు.కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు లేని కారణంగా షోలను క్యాన్సిల్ చేస్తున్నారు.
ఈ పరిస్థితి మరో 15 రోజులు ఉండే అవకాశాలున్నాయి.
పరీక్షల సీజన్ పూర్తి అవ్వడంతో పాటు, ప్రపంచ కప్ పోటీలు కూడా త్వరలో పూర్తి కానున్నాయి.
ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.పరీక్షలు అయ్యి పోయిన వెంటనే స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి.
ఏప్రిల్ నుండి వరుసగా పెద్ద సినిమాలు వెంట వెంటనే విడుదలకు రెడీగా ఉన్నాయి.వేసవిలో స్టార్ హీరోలు తమ సినిమాలో ప్రేక్షకులను కూల్ చేస్తామని అంటున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలో అంతో ఇంతో మంచి టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్‌ను మాత్రం తెచ్చుకోలేక పోతున్నాయి.అందుకే ఇది తెలుగు సినిమాకు పరీక్ష సమయం.







