ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యా నేను మాట్లాడితే మైక్ కట్ చేస్తారు .ఇప్పటికే మూడు రోజులుగా సాగుతున్న ఈ చర్చలో మా వాదనలు వింటే అన్ని విధాల మంచి సర్కారుకే జరుగుతుంది .
చప్పుడు చేయకుండా వినాలని అధికార పక్షానికి విజ్ఞప్తి చేశారు.విపక్షం చెప్పే మాటల్ని పరిగణలోకి సర్కారు తీసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది అని జగన్ తెలియచేసి పట్టిసీమపై వైఎస్ జగన్ చర్చ కొనసాగించారు .మధ్యలో మరోసారి మైక్ కట్ చేయించి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకున్నారు.నాడు దీనిపై వైఎస్‌ఆర్ హయాంలో చొరవ చూపలేదని దేవినేని ఒకింత గుస్సాగానే చెప్పారు.
వైఎస్ జగన్ మరింత అసహనం అయ్యారు .తమకు ఇచ్చిందే సమయం బహు తక్కువ మధ్యలో మైక్ కట్.మంత్రి స్టార్ట్…టాపిక్ డైవర్ట్ అని జగన్ వ్యాఖ్యానించారు.సభలో నవులూ పువులయ్యాయి







