పవన్‌ ‘సర్దార్‌’

‘జానీ’ సినిమాతో దర్శకుడిగా మారిన పవన్‌ కళ్యాణ్‌, ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో మరో సాని దర్శకత్వం వైపు వెళ్లలేదు.‘జానీ’ సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో పవన్‌ కళ్యాణ్‌ దర్శకత్వం చేయాలనే ఆలోచనను ఇంత కాలం పక్కకు పెట్టాడు.

 Pawan Kalyan Registers The Sardar Title-TeluguStop.com

అయితే త్వరలో పవన్‌ మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.‘జనసేన’ పార్టీని ప్రారంభించిన పవన్‌ రాజకీయ నేపథ్యంలో ఒక సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తన సొంత నిర్మాణ సంస్థలో పవన్‌ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ తాజాగా ‘సర్దార్‌’ అనే టైటిల్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించడం జరిగింది.

దాంతో పవన్‌ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరుగుతోంది.రాజకీయాలను చూపిస్తూనే, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘సర్దార్‌’ను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ రెడీ అవుతుందని అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ త్వరలో ‘గబ్బర్‌ సింగ్‌`2’ సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఆ తర్వాత దాసరి నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఆ తర్వాత ‘సర్దార్‌’ ప్రారంభం అవుతుందేమో అని పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube