కోలీవుడ్ హాట్ బ్యూటీ లక్ష్మి మీనన్‌కు సంబంధించి హాట్ ఫొటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసిన విషయం తెల్సిందే.తమిళంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మడికి ఆ వీడియోలు మరియు ఫొటోలు ఇబ్బందులను తెచ్చి పెట్టాడు.
తాజాగా ఆ ఫొటోలపై ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ… ప్రస్తుతం తాను ఇంటర్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నానని, వాటి నుండి తన మనస్సును మరల్చడానికి ఇలాంటి పోకిరి పనులు ఎవరో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పరీక్షలు పూర్తి కాగానే ఆ ఫొటోలు మరియు వీడియో ఎక్కడ నుండి వచ్చింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
తాను చిన్న పిల్లను అని, అలాంటి వీడియోలు మరియు ఫొటోలతో తనను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.ఒక వైపు చదువు కుంటూ మరో వైపు సినిమాల్లో నటిస్తున్న నాపై ఎవరో కావాలని ఇలాంటి చెత్త ప్రచారం చేస్తున్నారని లక్ష్మి మీనన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఈమె తమిళ స్టార్ హీరో కార్తి సరసన ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.ఆ సినిమా త్వరలో పూర్తి కానుంది.
ఇంకా ఈమె చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.







