మా తరపున ప్రశ్నించవా??

పవన్ కల్యాణ్…ఈ మాట వింటేనే అభిమానులకు ఒళ్ళంతా వైబ్రేషన్స్ వస్తాయి.కొంతకాలం వరకు సినీ పరిశ్రమకే పరిమితం అయిన ఈ పవర్ స్టార్.

 Bethapudi Farmers Want Pawan Kalyan To Question Tdp-TeluguStop.com

ప్రజా రాజ్యం పుణ్యమా అంటూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు.ఇక ఆతరువాత జెనసేన పేరుతో తానే ఒక పార్టీ పెట్టి పదవులకోసం కాదు…పవర్ కోసం కాదు…ప్రశ్నించడం కోసం అంటూ ప్రజల్లోకి వెళ్లాడు.

ఇక గత ఎన్నికల్లో టీడీపీ.బీజేపీ పార్టీకి అండగా నిలిచి ఆ పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా అన్న పవన్ ఆ తరువాత మౌనంగా ఉండిపోయాడు…ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ప్రశ్నించాలి అని అంటున్నారు ప్రజలు.మంగళ గిరి మండలం బేతపూడి గ్రామ ప్రజలు, రైతులు పవన్ ను ప్రశ్నిస్తున్నారు…ల్యాండ్ పులింగ్ పేరుతో అంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు, మాట్లాడరా, ప్రశ్నించరా అంటూ వారు వాపోతున్నారు.

మాకు జరుగుతున్న అన్యాయానికి రొడ్డెక్కాల్సిన పరిస్థతి దాపురించిందని వాపోయారు.గతంలో తమ గ్రామానికి 450 ఎకరాలు ఉండేదని, 30ఏళ్ల కిందట ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో 200 ఎకరాలు మిగిలినట్లు చెప్పారు.ఇప్పుడు ప్రభుత్వం తమ భూమి తీసుకుని ఏడాదికి రూ.30వేలు ఇస్తానంటోందని, అది ఏమూలకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ తరఫున పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని పవన్ అభిమానులు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube