మన దేశ ప్రధాని నరేంద్ర మోడి దేశం శుభ్రంగా ఉండడం కోసం స్వచ్చ భారత్ అనే ప్రోగ్రామ్ తెరపైకి తీసుకొస్తే.మాస్కోలో ఒక జంట అదే స్వచ్చ భారత్ ను స్వచ్చ మాస్కో గా మార్చుకుని హత్యలకు తెగబడ్డారు.
అపరిశుభ్రంగా ఉంటున్న వారిని టార్గెట్ చేసి హత్యలు చేశారు.కూడు గూడులేక ఫుట్‌పాతర్లు, పబ్లిక్ పార్కుల్లో తలదాచుకున్నవారినీ, పీకలదాకా తాగేసి దారితెన్ను తెలియక ఫుట్ పాతులపై పడిపోయిన మందుబాబులనూ లక్ష్యంగా చేసుకొని వారు హత్యలకు పాల్పడ్డారు.
చేసింది తప్పు అని ఒప్పుకోకపోగా…అనాథలు, అభాగ్యులులేని, తాగుబోతులు కనిపించని ‘స్వచ్ఛ’ మాస్కో నగరాన్ని స్థాపించడమే వారి లక్ష్యమని చెబుతున్నారు.నిరుడు జూలై నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెల వరకు మొత్తం 12 హత్యలు చేసి చివరకు దొరికిపోయారు.20 ఏళ్ల పాల్ వొయితోవ్, 25 ఏళ్ల ఎలేనా ఈ హత్యలకు పాల్పడ్డారు.ఒక బ్యాంక్ ఉద్యోగి హత్య విషయంతో బయటపడ్డ ఈ దంపతుల మ్యాటర్ పోలీసులకే వణుకు పుట్టించింది.
ఆ ఉద్యోగిని దాదాపు 107సార్లు కత్తితో పొడిచి చంపారు.అయితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని జైల్లోకి నెట్టారు.







