రుద్రమ శాటిలైట్‌ రికార్డు

గత కొంత కాలంగా టాలీవుడ్‌ సినిమాల శాటిలైట్‌ రైట్స్‌కు రెక్కలు వచ్చాయి.ఒక్కసారిగా శాటిలైట్‌ రైట్స్‌ ధరలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

 Rudramadevi Movie Satellite Rights Sold For Record Price-TeluguStop.com

చిన్న హీరో సినిమాలు కూడా కోట్లు పలుకుతున్నాయి.కారణం ప్రస్తుతం తెలుగులో ఉన్న ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్స్‌ మధ్య ఉన్న పోటీ తత్వం.

తమకే దక్కాలంటే తమకే అంటూ జెమిని, మా, జీటీవీలు పోటీ పడటంతో నిర్మాతలు లాభాల బాట పడుతున్నారు.స్టార్‌ హీరోల సినిమాలకు ఇక శాటిలైట్‌ రైట్స్‌తో చిన్న హీరోతో పెద్ద సినిమానే తీయవచ్చు.

అదే దారిలో గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ సినిమా కూడా భారీ శాటిలైట్‌ రైట్స్‌ను దక్కించుకుంది.

అనుష్క టైటిల్‌ రోల్‌లో రానా మరియు అల్లు అర్జున్‌లు ముఖ్య పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాను దర్శకుడు గుణశేఖర్‌ ఒక యజ్ఞంలా తయారు చేశాడు.

దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాను గుణ తెరకెక్కించిన విషయం తెల్సిందే.ఈ సినిమా కోసం అనుష్క ఎంతో కష్టపడ్డట్లుగా మేకింగ్‌ వీడియోను చూస్తుంటే తెలుస్తోంది.

దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం అయిన ఈ సినిమాను ప్రముఖ ఎంటర్‌టైనర్‌ చానెల దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఈ సినిమాను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube