ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది.ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన ఉన్న ఢిల్లీలో త్వరలో ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాస్వామ్య పాలన రాబోతుంది.
నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.నామినేషన్‌ల గడువును ఈనెల 21 వరకు విధించింది.22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.24 వరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది.ఇక ఫిబ్రవరి 7న ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఎన్నికల కమీషనర్ పేర్కొన్నారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు జరుగబోతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.
ఇక తమదైన ముద్ర చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూనే ఉన్నాడు.
ఇక మరోవైపు వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ కూడా హస్తినను హస్తగతం చేసుకునేందుకు తమ అస్త్ర శస్త్రాలను ఆదుదాలుగా వాడుతున్నారు.మోడీతో ప్రచారం చేయించి ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో కమలనాధులు ఉన్నారు.
ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.







