టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న నయన తార గురించిన ఒక ఆశ్చర్యకర విషయం తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం తమిళంలో మాత్రమే పలు సినిమాలో నటిస్తున్న నయనతార ఇటీవలే స్కిన్ షో చేయను అంటూ తేల్చి చెప్పిన విషయం తెల్సిందే.
ఇకపై తన వద్దకు వచ్చే ఏ నిర్మాతకు అయినా తాను ఇదే విషయం చెబుతానంటూ కుండబద్దలు కొట్టేసింది.గ్లామర్ పాత్రలకు వీడ్కోలు ఇచ్చిన నయన్ అతి త్వరలోనే సన్యాసినిగా మారబోతుందనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత నయనతార మన్నశాంతి కోసం కొన్ని రోజుల పాటు హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.పలు సార్లు ప్రేమలో విఫలం అవ్వడంతో నయన్‌లో నిరాశ మరియు నిశృహలు ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేసి ఉంటాయని అంటున్నారు.
నయన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆమె అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు.తెలుగులో నయన్ తార చివరి సినిమా ‘అనామిక’.
ఆ సినిమాలో నయన్ నటకు మంచి మార్కులు పడ్డాయి.నయన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.







