రుణ మాఫీ మీద జీవో విడుదల చేసిన బాబు

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రైతులకు గొప్ప వరమే అందించారు.రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరుణ మాఫీ కి బాబు పచ్చ జెండా ఊపి రుణాల నుండి రైతులను విముక్తి చేశారు చంద్రబాబు

 Ap Govt Go Released : Farm Loan Waiver Up To Rs. 1.5 Lakh-TeluguStop.com

ఎన్ని అడ్డంకులు ఎదురయినా ఎప్పటి నుండో రుణ మాఫీ వంద శాతం అమలు చేస్తాం అని చెబుతున్న బాబు తన మాట నిలబెట్టుకున్నారు .వ్యవసాయ రుణాలని మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 174 ను జారీచేసింది.13 జిల్లాల్లోని వ్యవసాయ రుణగ్రహీతలకు ఈ మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ, సహకార సంఘాల వద్ద తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయని ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది.పంట రుణాలు మాత్రమే కాకుండా వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వాటిని కూడా మాఫీ చేయనున్నట్టు జీవో లో పేర్కొంది

అయితే 2014 మార్చి 31లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని జీవో లో పేర్కొంది .ఈ జీవో ప్రకారం డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల పరిమితి వరకు కూడా రుణమాఫీ కానున్నాయి.పెండింగ్ ఉన్న రుణాలే కాకుండా మార్చ్ 31 లోపు చెల్లించిన రుణాలు కూడా రైతులకు తిరిగి అందచేయనున్నట్టు జీవో లో పేర్కొనడం విశేషం.

దీని ద్వారా రాష్ట్ర బడ్జెట్ మీద దాదాపు 37000 కోట్ల భారం పడనుందని సమాచారం .ఆర్బీఐ నుండి ఎన్ని అవాంతరాలు ఎదురయినా బాబు తమ రుణాలు మాఫీ చేయడం మీద రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .బాబు రుణ మాఫీ తో తమకు చేసిన రుణాన్ని తీర్చుకోలేమని,బాబు తమకు దేవుడితో సమానమని అంటున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube