ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బాబు వాచ్ తీసాడంటే మ్యాచ్ మొదలయినట్టే అని ఆగడు టీజర్ లో వెన్నెల కిషోర్ అన్నట్టు మహేష్ సినిమా హిట్ అయిందంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లు బద్దలయినట్టే .
అందుకే మహేష్ తో సినిమా అంటే నిర్మాతలు లైన్ లో నిలబడతారు .అయితే ఇప్పుడు మహేష్ తో సినిమా తీయటానికి ఒక నిర్మాత ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ గురించి ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి
గోపీచంద్ హీరోగా ఇపుడు ‘లౌక్యం’ నిర్మిస్తున్న భవ్య క్రియేషన్స్ అధినేత ప్రొడ్యూసర్ ఆనందప్రసాద్ మహేష్ తో ఓ అప్‌కమింగ్ మూవీ కోసం 18 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసాడని విశ్వసనీయ సమాచారం.‘ఆగడు’ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్‌లోవున్న మహేష్ ఇదివరకే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట .అందుకు గాను సదరు ప్రొడ్యూసర్ ఎనిమిది కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాడని సమాచారం
ఇన్నీ రోజులు తోటి హీరో పవన్ కళ్యాణ్ తో సమంగా మహేష్ 14 కోట్లు తీసుకునేవాడట.ఈ మధ్య వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తో పవన్ తన ఫీజ్ ను 20 కోట్ల దాకా చేయడం తో మహేష్ కూడా పవన్ కు పోటీగా రెమ్యునరేషన్ పెంచేసాడు అని టాక్ .కొరటాల శివ తో చేస్తున్న సినిమా పూర్తి అయ్యాక ఈ మూవీ సెట్ ల మీదకు రానుందని, ఓ టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
మరొక వైపు మహేష్ బాబు ఆగడు సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది.ఈనెల 23 వరకు మహేష్ తమన్నాలపై ఓ పాటను యూరప్ లో షూట్ చేసేలా షెడ్యూల్ ఉంది.
కాబట్టి అక్కడి నుంచి సినిమా యూనిట్ వచ్చి, పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టి పూర్తయ్యే సరికి మరో యాబై రోజులు పడుతుంది.దీంతో అక్టోబర్ లో విడుదల చేయాలని సినిమా పెద్దలు బావిస్తున్నారు.
అక్టోబర్ 3న శుక్రవారం కావటంతో ఆ రోజున సినిమా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.







