న్యాచురల్ స్టార్ నాని, హీరోగా శైలేష్ కొలను( Natural Star Nani, Sailesh Kolanu ) డైరెక్షన్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన హిట్3 సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాకు నాని రెమ్యునరేషన్ తో కలిపి 100 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ సినిమాకు 135 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
రిలీజ్ కు ముందే నానికి 35 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని భోగట్టా.
శేలేష్ కొలను గత సినిమా సైంధవ్ ( Saindhav )బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.హిట్3 సినిమాలో( hit3 movie ) అడివి శేష్ కూడా కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారని ఆ పాత్ర కోసం అడివి శేష్ కు భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది.ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సైతం నాని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలతో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.హిట్3 సినిమా క్లైమాక్స్ భారీ స్థాయిలో షూట్ చేశారని ఈ క్లైమాక్స్ కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు( 8 crore rupees ) చేశారని ఈ సినిమ కోసం విదేశీ టెక్నీషియన్లు పని చేశారని సమాచారం అందుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో హిట్3 సినిమాకు 25 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.నాని అన్నీ తానై వ్యవహరిస్తూ ఉండటం హిట్3 సినిమాకు ప్లస్ అయింది.నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
న్యాచురల్ స్టార్ నాని హిట్3 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.