ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి(Srivarshini) అనే యువతి కొద్దీ రోజుల క్రితం అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే.ఆమెను ఓ లేడీ అఘోరీ నాగసాధు (Lady Aghori Naga Sadhu)ప్రలోభపెట్టి తీసుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు.
దీనిపై వారు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో(Mangalagiri Police Station) ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.శ్రీవర్షిణి తల్లిదండ్రుల ప్రకారం, కొంత కాలం క్రితం మంగళగిరికి ఓ లేడీ అఘోరీ వచ్చింది.
దానిని చూసి జాలి పడి తమ ఇంటికి పిలిచినట్లు అప్పట్లో ఆమెకు బట్టలు ఇచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు.అయితే, అదే సమయంలో ఆ అఘోరీ తమ కూతురిని ప్రలోభపెట్టి తనతో తీసుకెళ్లిందని వారు ఆరోపించారు.
దీంతో తమ కుమార్తెను విడిపించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు.
ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.
అయితే, శ్రీవర్షిణి తొలుత తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు వెల్లడించింది.అయినప్పటికీ, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును కొనసాగించారు.
చివరికి గుజరాత్‌లో(Gujarat) ఆమె ఆచూకిని గుర్తించి లేడీ అఘోరీ (Aghori)చెర నుంచి శ్రీవర్షిణిని (Srivarshini) విడిపించారు.గుజరాత్ పోలీసులు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న వెంటనే మంగళగిరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో ఆమె తల్లిదండ్రులు గుజరాత్‌కి వెళ్లి తమ కూతురిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే, శ్రీవర్షిణి తన కుటుంబ సభ్యులతో వెళ్లడానికి సుముఖంగా లేదని, లేడీ అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదని చెప్పినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.పోలీసులు తనను బలవంతంగా తీసుకువస్తున్నారని ఆమె మొరపెట్టుకోవడం ఈ వ్యవహారంపై మరింత సందేహాలను రేకెత్తించింది.ప్రస్తుతం కుటుంబ సభ్యులు శ్రీవర్షిణిని ఏపీకి (Srivarshini AP)తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో ఆమె మంగళగిరికి చేరుకునే అవకాశం ఉంది.కాగా, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగళగిరి పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై మరింత స్పష్టత రావాల్సి ఉండగా, శ్రీవర్షిణి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి మంగళగిరికి వచ్చిన తర్వాత ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.