యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో(Directed Rajamouli) వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ అదే స్థాయిలోనే సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఇటీవల దేవర(Devara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంది.ప్రస్తుతం ప్రశాంత్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాతో పాటు బాలీవుడ్ వార్ 2(war2) సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR directed by Koratala Siva)నటించిన దేవర(Devara) సినిమా జపాన్లో కూడా విడుదలయ్యి అక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది.
ఇక ఈ సినిమా అక్కడ విడుదల కావడంతో గత కొద్దిరోజులుగా దర్శకుడు కొరటాల ఎన్టీఆర్ ఇద్దరు కూడా జపాన్లో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కి ఊహించని ప్రశ్న ఎదురయింది.

మీకు మరొక జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలని కోరుకుంటారనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఊహించిన విధంగా సమాధానం చెప్పారు.సాధారణంగా అయితే తాను తిరిగి తన తల్లి కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను, లేదా తన తాతలాగా పుట్టాలని కోరుకుంటున్నానని సమాధానం చెబుతారని భావించారు .కానీ ఎన్టీఆర్ మాత్రం తాను ఒక మంచి చెఫ్(Chef) గా పుట్టాలని కోరుకుంటాను అంటూ సమాధానం ఇచ్చారు.జపాన్ (Japan)లో ఫేమస్ వంటకంలో మరింత ఎక్స్ పర్ట్ అనిపించుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ (NTR)ఎంతో అద్భుతంగా వంటలు చేస్తారని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.అందుకే తనకు మళ్ళీ జన్మంటూ ఉంటే కచ్చితంగా చెఫ్ కావాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.