శివాలయంలో దారుణం.. శివుడిపై కాలుపెట్టి

హైదరాబాద్ లో ఇటీవల హిందు దేవాలయాల్లో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి.ఆలయాలపై దాడులు, దేవతా విగ్రహాలను అవమానించే ఘటనలు భక్తులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

 Atrocity In Shiva Temple.. Stepping On Shiva, Hyderabad, Temple Vandalism, Hindu-TeluguStop.com

కొంతకాలంగా కొన్ని శక్తులు హిందు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని ఘోరాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదివరకు సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని అవమానించడం పెద్ద దుమారాన్ని రేపింది.

ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన జరగడం భక్తుల హృదయాలను కలిచివేసింది.దీనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతూ, ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి.

ఇకపోతే, తాజాగా హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతంలో మరో ఆలయ అపచారం వెలుగులోకి వచ్చింది.గాంధీ నగర్ ప్రాంతంలోని శివాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి భీబత్సం సృష్టించారు.

దొంగలు శివలింగంపై కాలుపెట్టి మరీ చోరీ చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.పూజారి తెల్లవారు జామున ఆలయ తలుపులు తెరిచి ఉండటం గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.శివలింగంపై అపచారం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఒక వర్గాన్ని ప్రోత్సహించేందుకు పోలీసులు పనికివచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి.దేవాలయాల భద్రతను పెంచాలని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇటీవల ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని, శివలింగంపై అపచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మరి పోలీసులు, ప్రభుత్వం ఈ ఘటనలపై ఎలా స్పందిస్తాయో చూడాలి.

https://twitter.com/TelanganaMaata/status/1899279497503121850
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube