రంజాన్ మాసం(The month of Ramadan) ముస్లింలకు ఎంతో పవిత్రమైన సమయం.రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ విందుతో (iftar dinner)ముగిస్తారు.
అయితే పాకిస్థాన్‌లో జరిగిన ఓ ఇఫ్తార్ విందు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి.
ఇస్లామాబాద్‌లోని షా ఫైసల్ మసీదులో (mosque)జరిగిన ఇఫ్తార్ విందులో ఆహారం కోసం జనం ఎగబడ్డారు.ప్లేట్లు పెట్టగానే వందలాది మంది ఒక్కసారిగా వాటిపై పడ్డారు.తోపులాటలు, నెట్టివేతలు(Fights, pushing and shoving), ఆహారం కోసం జనం పిచ్చిగా ప్రవర్తించారు.ఆ దృశ్యాలు చూస్తే షాక్ అవ్వక మానరు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్ పరువు గంగలో కలిసిందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.దేశంలో నెలకొన్న పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“భారత్” అనే నెటిజన్ ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యాడు.“వాళ్లు పిచ్చి భయంతో దేశాన్ని సృష్టించారు.ఇతరుల భూములను లాక్కోవాలని చూశారు.ఇప్పుడు తిండి కోసం కొట్టుకుంటున్నారు.చరిత్రలో వీరిని మించిన వెర్రివాళ్లు ఉండరు” అంటూ కామెంట్ చేశాడు.”డాక్టర్ ఆర్కిటెక్ట్” అనే మరో నెటిజన్ ప్రభుత్వానికే చురకలు అంటించాడు.“ప్రజలు అణు శక్తిని తినలేరు.తప్పుడు ప్రాధాన్యతల వల్ల ప్రజలు పేదలు అవుతారు.
ఈ వీడియోలో కనిపిస్తున్నది బిచ్చగాళ్లు” అని విమర్శించాడు.
ఇలాంటి వీడియో రావడం ఇదేం మొదటిసారి కాదు.
గతంలో 2023లో కూడా పాకిస్థానీయులు మోటార్‌బైక్‌లపై గోధుమల లారీని వెంబడించిన వీడియో వైరల్ అయింది.ఆ వీడియో కూడా దేశ ఆర్థిక సంక్షోభంపై చర్చకు దారితీసింది.
తాజా ఘటన పాకిస్థాన్‌లో ఆహార కొరత, ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయనే ఆందోళనలకు అద్దం పడుతోంది.కొందరు ఇది పేదరికం, ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిందని విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది సమాజంలో లోతుగా పాతుకుపోయిన సమస్యలకు నిదర్శనమని అంటున్నారు.







