9 నెలల పసిగుడ్డును బలిగొన్న కూల్ డ్రింక్ మూత.. ఆదిలాబాద్‌లో విషాదం..

పిల్లల్ని నిత్యం కాపాడుకోవాలి.చిన్న పిల్లలైతే వారిపై ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి.

 Cool Drink That Killed A 9-month-old Baby Is Closed.. Tragedy In Adilabad.., Bab-TeluguStop.com

క్షణం ఏమరుపాటుగా ఉన్నా పెను ప్రమాదం జరుగుతది.ఇదిగో ఈ విషాద ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

ఊహించని రీతిలో ఓ కూల్ డ్రింక్ మూత 9 నెలల పసిగుడ్డు ప్రాణాలు తీసింది.

ఉట్కూరు గ్రామంలో ఈ గుండెలు పిండేసే ఘటన జరిగింది.

రుద్ర అయన్ అనే 9 నెలల బాబు వాళ్ల తల్లిదండ్రులతో కలిసి లక్సెట్‌పేట మండలం కొమ్మగూడలో జరిగిన ఓ ఫంక్షన్‌కు పోయాడు.నాన్న సురేందర్, మిగతా బంధువులంతా సందడిలో ఉండగా, ఇంతలో జరగరాని ఘోరం జరిగింది.

ఫంక్షన్ జరుగుతుండగా ఆడుకుంటూ తిరుగుతున్న రుద్ర అయన్ ఎప్పుడు కూల్ డ్రింక్ మూత పట్టుకున్నాడో ఎవరికీ తెలీదు.అది కాస్తా నోట్లో వేసుకొని మింగేశాడు పాపం.

కొంతసేపటికి బిడ్డ అమ్మానాన్నలకు తేడాగా అనిపించడంతో గమనించారు.దాంతో అది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.

వెంటనే బాబును తీసుకొని దగ్గర్లోని హాస్పిటల్‌కు పరుగులెత్తారు.డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.చిన్నారి పరిస్థితి విషమించడంతో ఏం చేయలేక చేతులెత్తేశారు.రుద్ర అయన్ ఇక లేడని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

పండుగలాంటి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.రుద్ర అయన్ మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

చిన్నారి వస్తువులు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.కళ్లముందు ఆడుకునే పిల్లల్ని క్షణమైనా ఏమరుపాటుగా చూడొద్దని ఈ విషాద ఘటన మరోసారి గుర్తు చేసింది.

ఒక్క క్షణం అజాగ్రత్త.తీరని విషాదాన్ని మిగుల్చుతుంది.

అందుకే ప్రతి ఒక్కరూ ఇలాంటి మూతలు చిన్నపిల్లలకు దగ్గరగా పెట్టకుండా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube