7/G బృందావన్ కాలనీ.( 7/G Brundavan Colony ) దాదాపుగా 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ అప్పట్లో యూత్ ను తెగ ఆకట్టుకుంది.ఈ సినిమాలోని పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో నిర్మాత ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ( Ravi Krishna ) హీరో గా నటించిన విషయం తెలిసిందే.సోనియా అగర్వాల్( Sonia Agarwal ) హీరోయిన్ గా నటించింది.
దివంగత నటుడు చంద్రమోహన్ సుమన్ శెట్టి, సుదీపా పింకీ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నమ్ నిర్మించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.తమిళంలో 7/G రెయిన్ బో కాలనీగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా రిలీజై సంచలన విజయాన్ని అందుకుంది.హీరో, హీరోయిన్ల నటన, సుమన్ శెట్టి, యువన్ శంకర్ రాజా బాణీలు ఇలా బృందావన కాలనీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
అయితే అలాంటి ఒక గొప్ప సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేశాను అంటున్నారు టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్.ఆయన మరెవరో కాదు థమన్.( Thaman ) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకరు.ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
అదేవిధంగా భారీగా సంపాదిస్తున్నారు.

అయితే తాజాగా విడుదల అయినా శబ్దం సినిమాకు( Sabdham Movie ) తమన్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నేను చాలా సినిమాలను రిజెక్ట్ చేసాను అందులో 7/G బృందావన కాలనీ సినిమా కూడా ఒకటి.
ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసాను అంటే నాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కోరిక.అందుకోసం చాలా సినిమాలను రిజెక్ట్ చేశాను.ఈ సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాలు కూడా నేను వదులుకున్నాను అని చెప్పుకొచ్చారు థమన్.అయితే ఈ సందర్భంగా తమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఒకప్పుడు ఎన్నో సినిమాలను వదులుకున్నప్పటికీ ప్రస్తుతం అంతకు రెండింతలు సంపాదిస్తున్నారు తమన్.







