తేళ్లు, బొద్దింకలు తింటాను.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

డాక్టర్ అవ్వబోయి యాక్టర్లుగా మారిన సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో చాలామంది సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు.

 Kamakshi Bhaskarla Sharing Her Dietary Habits Details, Kamakshi Bhaskarla, Tolly-TeluguStop.com

కానీ డాక్టర్లుగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు అతి కొద్ది మంది ఉన్నారని చెప్పాలి.అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల( Kamakshi Bhaskarla ) కూడా ఒకరు.

చైనాలో( China ) ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌ గా పని చేసిన ఈ తెలుగమ్మాయి కొన్నాళ్ల తర్వాత వైద్య వృత్తిని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.మా ఊరి పొలిమేర చిత్రంతో నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.

Telugu Cumkamakshi, Chaina, Telugukamakshi, Tollywood-Movie

విరూపాక్ష, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర 2 లాంటి సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మంచు గుర్తింపు తెచ్చుకుంది.అయితే కామాక్షి కేవలం నటిగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయం.ఆమె డాక్టర్( Doctor ) చదివిందని చైనాలో ఆరేళ్ళ పాటు ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు.తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి చెప్పకు వచ్చింది కామాక్షి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.చైనాలో ఆరేళ్ల పాటు ఉన్నాను.

నాకు వంటలు చేయడం వచ్చు.గదిలోనే నేను వంట చేసుకొని తినేదాన్ని.

అయితే చైనా ఫుడ్‌( Chinese Food ) రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆ ఫుడ్‌ తిన్నాను.బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూశాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

Telugu Cumkamakshi, Chaina, Telugukamakshi, Tollywood-Movie

నేను ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ వంటకాలు ట్రై చేస్తాను.అందులో భాగంగానే చైనా ఫుడ్‌ తిన్నాను అని కామాక్షి చెప్పుకొచ్చింది.అంతేకాదు చైనా వాళ్లు బొద్దింకలు, పాములు, తేళ్లను ఎందుకు తింటారో కూడా వివరించింది.కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదనీ తినడానికి కూరగాయలు దొరకని పరిస్థితుల్లో ఇలా కనిపించిన జీవుల్ని చంపి తినడం అలవాటైందని మీనాక్షి చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ కామెంట్స్ పై కొందరు పాజిటివ్గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube