ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ చాలామంది ప్లాప్ సినిమాలను చేస్తున్నారు.
నిజానికి రామ్ చరణ్( Ram Charan ) లాంటి స్టార్ హీరో ‘గేమ్ చేంజర్’( Game Changer ) లాంటి సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడం అనేది నిజంగా అందరిని బాధపెట్టే విషయమనే చెప్పాలి.
రామ్ చరణ్ శంకర్( Shankar ) లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఆ సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా చిత్రీకరిస్తే బాగుండేది.కానీ శంకర్ మాత్రం ఈ సినిమా మీద అసలు ఏ మాత్రం ఎఫెక్ట్ పెట్టకుండా ఈ మూవీని తీసినట్టుగా ఈజీగా తెలిసిపోతుంది.
మరి ఈ సినిమాతో ఆయన తన పూర్తి ఫామ్ ను కోల్పోయాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక శంకర్ ని నమ్ముకొని రామ్ చరణ్ ఈ అవకాశాన్ని ఆయనకు అందిస్తే ఆయన రామ్ చరణ్ ని పూర్తిగా బ్యాడ్ చేశాడనే చెప్పాలి.
సినిమాలు తీయడం చాతకాకపోతే తీయనని చెప్పాలి.
అంతేగాని ఇష్టం వచ్చినంత లెంత్ తో సినిమాను తీసి శంకర్ తన తోటి దర్శకులకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు.ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తుంటే చాలామంది సినిమా మేధావులు సైతం శంకర్ సినిమాల మీద విమర్శలు గుప్పిస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ కి జరగాల్సిన నష్టం అయితే జరిగింది.
మరి తమ తదుపరి సినిమాలతో ఆ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరమైతే ఉంది…