రాజన్న సిరిసిల్ల జిల్లా :గత బంగారు తెలంగాణలో కిషన్ దాస్ పేట లోని ఆరో వార్డులో ఉన్న ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదు.పలుమార్లు అధికారులకు జిల్లా నాయకులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీసీ రోడ్డులు, డ్రైనేజీలు ఎక్కడెక్కడ నిర్మాణం కానిచోట్ల నిర్మాణం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,
పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, సిబ్బంది కలిసి ఎస్సీ కాలనీలో రోడ్డు, డ్రైనేజీలను కొలతలు వేశారు.త్వరలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ ఇండ్లకు సకాలంలో పన్నులు చెల్లించాం, పాలకులకు ఓట్లు వేశాం కానీ మా కాలనీలో అభివృద్ధి జరగలేదని వాపోయారు.ఈ ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీలు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శనిగరపు బాలరాజు, శనిగరపు రాములు, శనిగరపు రాజనర్సు, శనిగరపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.







