టాలీవుడ్ లెజెండ్ దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్టీఆర్ కి దీటుగా సినిమాలు చేసి మెప్పించారు అక్కినేని నాగేశ్వరరావు.
కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా దర్శకుడుగా ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు అయితే అందులో ఒక కన్నుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే సాధారణంగా ఆ స్థాయిలో ఉన్నప్పుడు తన వారసులను సినిమాల్లోకి తీసుకురావాలని ఉంటుంది.
కానీ అక్కినేని మాత్రం ఎప్పుడూ అది కోరుకోలేదట.ఏనాడూ నాగార్జునని సినిమాలు చేయాలని కోరలేదట.అది నాగార్జున ఇష్టంతోనే సాధ్యం అయ్యిందట.
నాగ్ మెకానికల్ ఇంజనీర్ చేసేందుకు ఫారెన్ వెళ్లాడట.అలా జాబ్ గానీ, బిజినెస్ వైపుగానీ వెళ్లే ఆలోచన ఉండేదట.
సినిమాల్లోకి రావాలని తాను కూడా ఎప్పుడూ అనుకోలేదట.మెకానికల్ ఇంజనీర్(Mechanical Engineer) అయిపోయిన తర్వాత ఇండియా వచ్చారట.
ఏం చేయాలనేది పెద్ద డైలామా నడుస్తుంది.ఈ క్రమంలో ఏఎన్నార్ సినిమాలు నిర్మిస్తున్నారు.
అన్న వెంకట్(Venkat) ఆ ప్రొడక్షన్స్ చూసుకుంటున్నారు.నాగ్ కూడా వాటిలో ఇన్‌వాల్వ్ అయ్యారట.
అయితే ప్రొడక్షన్ పెంచాలనుకున్నారు.హీరోలు, దర్శకులను అడిగితే ఎవరూ చేయలేదట.వీళ్లేంటి చిన్నపిల్లలు సినిమాలు ఏం నిర్మిస్తారు లే అనుకున్నారట.లైట్ తీసుకున్నారట.చాలా రోజులవుతుంది.ఒక్క సినిమా కూడా సెట్ కాలేదు.
దీంతో అనుకోకుండా ఒక రోజు రాత్రి వెంకట్ తన మనసులో మాట బయటపెట్టాడు.నువ్వు సినిమా చేస్తావా అని అడిగాడట.
నాగార్జునలో (Nagarjuna)పెద్ద టెన్షన్.నేను సినిమాలు చేయగలనా అని అనుకున్నాడట.
కానీ భయంగానే ఒప్పుకున్నాడు.ఇదే విషయాన్ని ఏఎన్నార్‌కి చెప్పారట.
తాను సినిమాలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించగానే ఒక్కసారిగా ఏఎన్నార్ (ANR)కన్నీళ్లు పెట్టుకున్నారట.నాగ్‌ని చూడకుండా పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నాడట.
నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం అది రెండో సారి అని, అమ్మ అన్నపూర్ణమ్మ(Annapurnamma) చనిపోయినప్పుడు నాన్నని ఏడవడం చూశాను.ఆ తర్వాత నా నిర్ణయం చెప్పినప్పుడు ఆయనలో కన్నీళ్లు చూశాను అని తెలిపారు.