భారత సంతతికి చెందిన బ్రిటీష్ గూఢచారి , టిప్పు సుల్తాన్ ( Tipu Sultan )వారసురాలైన నూర్ ఇనాయత్ ఖాన్‌కు ( Noor Inayat Khan )అరుదైన గౌరవం దక్కింది.ఆమె అందుకున్న జార్జ్ క్రాస్ మెడల్‌ను వచ్చే నెలలో వాయువ్య లండన్‌లోని కొలిండేల్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్ఏఎఫ్) మ్యూజియంలో ప్రదర్శించబడనుంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ తో కలిసి పారిస్‌లో అండర్ కవర్ ఆపరేషన్‌లో రహస్యంగా పాల్గొని .చివరికి మిత్ర రాజ్యాల సేనల కోసం తన ప్రాణాలను ఆర్పించారు నూర్.
జర్మన్ ఆక్రమిత ప్రాంతంలో రహస్యంగా పనిచేసి విలువైన సమాచారాన్ని సేకరించిన నూర్ ఇనాయత్ బ్రిటన్‌కు అందజేశారు.ఆమె ధైర్యసాహసాలకు గాను మరణానంతరం యూకే అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది.
అయితే నాజీలకు పట్టుబడిన నూర్ ఇనాయత్ ఫ్రాన్స్‌లోని డాచౌ కాన్‌నెంట్రేషన్ క్యాంపులో తీవ్ర చిత్ర హింసలను ఎదుర్కొని ఉరితీయబడ్డారు. లండన్‌కు ( London )చెందిన స్పై ప్రిన్సెస్ : ది లైఫ్ ఆఫ్ నూర్ ( Spy Princess The Life of Noor )జీవిత చరిత్ర రచయిత శ్రబానీ బసు మాట్లాడుతూ.నూర్‌కు చెందిన జార్జ్ క్రాస్ ఆర్ఏఎఫ్ మ్యూజియాన్ని ప్రతి యేటా వేల మంది సందర్శకులు వీక్షిస్తారని తెలిపారు.
1914లో మాస్కోలో జన్మించారు నూర్ ఇనాయత్.ఈమె తండ్రి భారతీయ సూఫీ సన్యాసి కాగా .తల్లి అమెరికన్ మహిళ.నూర్ చిన్నతనంలోనే వీరి కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది.అనంతరం ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు.బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్ మహిళా విభాగంలో ఇనాయత్ విశేష సేవలు అందించారు.అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనూ విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించారు.
నిఘా, గూఢచార్యం నిమిత్తం ఏర్పాటు చేసిన ఎస్‌వోఈ విభాగంలో చేరారు.అంతేకాదు.అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఫ్రాన్స్‌పై నిఘా నిమిత్తం నియమించిన తొలి మహిళా గూఢచారిగా ఇనాయత్ రికార్డు సృష్టించారు.ప్రమాదకర పరిస్ధితుల్లో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచినందుకు గాను ప్రతిష్టాత్మక జార్జ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఆర్ఏఎఫ్ ఉమెన్స్ యాక్సిలరీ ఎయిర్‌ఫోర్స్ (డబ్ల్యూఏఏఎఫ్)లో జార్జ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్న ఇద్దరిలో ఒకరుగా ఇనాయత్ చరిత్రలో నిలిచిపోయారు.