భారత్-దక్షిణాఫ్రికా( India-South Africa ) జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్‌లో( T20 series ) చివరి మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్రికా బౌలర్లను చిత్తు చేసారు.
భారత ఇన్నింగ్స్‌లో జట్టు ఓపెనర్ సంజూ శాంసన్ కొట్టిన సిక్సర్‌తో స్టేడియంలో ఉన్న మహిళా అభిమాని తీవ్రంగా గాయపడింది.ఆమె చాలా బాధలో ఉన్నట్లు కనిపించింది.
సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ.గత రెండు మ్యాచ్‌ల్లో సున్నాతో ఔటైనా.
చివరి మ్యాచ్‌లో మరోసారి పునరాగమనం చేశాడు.

భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్‌పై సంజూ శాంసన్ ( Sanju Samson )వరుస బంతుల్లో సిక్సర్లు బాదాడు.అయితే ఈ సమయంలో రెండో సిక్సర్ సెక్యూరిటీ గార్డు శరీరానికి తగిలి మహిళా అభిమాని ముఖానికి తగలడం బాధ కలిగించింది.తర్వాత ఆమె నొప్పితో ఏడుస్తూ కనిపించింది.
అయితే షాట్ కొట్టిన సంజూ క్షమాపణలు కూడా చెప్పాడు.టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బ్యాటింగ్‌కు వచ్చిన ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు అద్భుతంగా ఆరంభించి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు.ఆరో ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ కీపర్ క్లాసన్ చేతికి చిక్కి లూథో సిపమల దక్షిణాఫ్రికాకు తొలి వికెట్ ను అందించాడు.
అభిషేక్ శర్మ ( Abhishek Sharma )18 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో 34 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

దీని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ( Tilak Verma ).సంజూ శాంసన్‌తో కలిసి 210 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి మైదానంలో సిక్స్‌లు, ఫోర్లతో అదరగొట్టారు.సంజూ శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో ఇన్నింగ్స్ (109 నాటౌట్) పరుగులు చేశాడు.
కాగా, తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 120 పరుగులు (నాటౌట్) గా నిలిచారు.మొథానాయికి టీమిండియా నాలుగో టి20 లో దక్షిణాఫ్రికా పై 135 పరుగుల భారీ విజయ్యని నమోదు చేసింది.







