ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి.ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టారు.రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూపొందించింది.రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు కాగా.మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు.బుడ్జెస్ట్ ప్రవేశపెట్టక ముందు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది.చర్చిల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపగా.రూ.2.94 లక్షల కోట్లు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా దానిని కేబినెట్ ఆమోదించింది.
ఇక ఈ బడ్జెట్ లో విద్య, వైద్య, నీటి పారుదల, సంక్షేమం రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థికశాఖ బడ్జెట్‌ను రూపొందించారు.
ఇక కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
* రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు.
* ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు,
* రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.
*పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.16.739 కోట్లు.

* జలవనరులు రూ.16,705 కోట్లు.
* ఉన్నత విద్య రూ.2326 కోట్లు.
* పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు.
* పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.
* ఇంధన రంగం రూ.8,207 కోట్లు.
* పోలీస్ శాఖ రూ.8495 కోట్లు.
* బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు.
* మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు.

* ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు.
* అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు.
* గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు.
* నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.
ఇలా అన్ని శాఖలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయించారు.