సాధారణంగా ఎవరైనా పిల్లలు అనుకున్నది సాధిస్తే మాత్రం ముందుగా సంతోషించేది తల్లిదండ్రులు అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు.విజయం సాధించేది ఒక వంతు అయితే.
తల్లిదండ్రులు ఆ విజయం గురించి ప్రసంగిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు అని చెప్పాలి.అయితే అప్పటిలో ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ‘ హను మన్ ‘ సినిమాతో పెద్ద హిట్ సొంతం చేసుకున్న క్రమంలో ప్రశాంత్ వర్మ తండ్రి సినిమా రివ్యూ చెప్పి డైరెక్టర్ నా కొడుకు అంటూ గర్వంగా తెలిపాడు.
సినిమాని, ప్రశాంత్ వర్మను తెగ పొగిడేసాడు.అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
అయితే తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి( Director Venky Atluri ) తండ్రి కూడా తన కొడుకు సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వెంకీ అట్లూరి ఈ దీపావళి పండుగ సందర్భంగా లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ప్రముఖ థియేటర్లలో ఒకటైన ఐమాక్స్ లో సినిమా చూసిన వెంకీ అట్లూరి తండ్రి( Venky Atluri Father ) థియేటర్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ వాళ్లతో సినిమా గురించి మాట్లాడుతూ.సినిమా చాలా బాగుందని, మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని,
సినిమా డైరెక్టర్ మా అబ్బాయి, ఈ లక్కీ భాస్కర్ సినిమాకు 4 రేటింగ్ ఇస్తానని తెలిపాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కరలు కొడుతుంది.అప్పుడు ప్రశాంత్ వర్మ తండ్రి గర్వంగా సినిమా విజయం గురించి తెలియచేస్తే.
ఇప్పుడు వెంకీ అట్లూరి తండ్రి గొప్పగా గర్వపడుతున్నారు.కొడుకుల సక్సెస్ చూసి విరి ఆనందానికి అవధులు లేవని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, వెంకీ అట్లూరి తండ్రి మాట్లాడిన వీడియోను ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ కష్టపడి పని చేస్తే ప్రతి వ్యక్తికి తండ్రి నుంచి ఇలాంటి ప్రశంసలు సొంతం చేసుకోవాల్సిందే అంటూ ట్విట్టర్ లో ట్విట్ చేశాడు.