టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ప్రభాస్ స్థాయిలో సినిమాలలో నటిస్తున్న మరో హీరో లేరనే చెప్పాలి.
ప్రభాస్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) కాంబినేషన్ లో సినిమా అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే బ్రహ్మరాక్షస( Brahma Rakshasa ) అనే టైటిల్ తో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.
ప్రభాస్ ను నెగిటివ్ రోల్ లో( Prabhas Negative Role ) ప్రశాంత్ వర్మ చూపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ వర్మ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ కాంబోలో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.ప్రశాంత్ వర్మ లైనప్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.మోక్షజ్ఞ మూవీ, జై హనుమాన్ సినిమాలతో ప్రశాంత్ వర్మ మెప్పిస్తే మాత్రం ఈ యంగ్ డైరెక్టర్ దశ మారిపోయినట్టేనని చెప్పవచ్చు.
ప్రభాస్ ప్రశాంత్ తర్వాత సినిమాలతో ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.

ప్రశాంత్ వర్మ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ దర్శకుడు భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రశాంత్ వర్మ తన సినిమాలో ప్రభాస్ ను ఏ విధంగా చూపిస్తారో అనే చర్చ జోరుగా జరుగుతుంది.ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది.
టాలీవుడ్ టాప్ బ్యానర్లు అన్నీ ప్రశాంత్ వర్మతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రశాంత్ వర్మ కొన్ని సినిమాలకు కథలు అందిస్తూ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.ప్రశాంత్ వర్మ నిదానంగా క్రేజ్ పెంచుకుంటున్నారు.
ఈ డైరెక్టర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.