రాజన్న సిరిసిల్ల జిల్లా :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్,సిరిసిల్ల విద్యార్థినీ గంగన్న వేణి ప్రవళిక ఉషు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.68వ SGF (స్కూల్ గేమ్ ఫెడరేషన్) పోటీలకు ఎంపిక నవంబర్ రెండు మూడు తేదీలలో మహబూబాద్ లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవళికను ప్రధానోపాధ్యాయురాలు లోకిని శారద విద్యార్థిని సర్టిఫికెట్, మెడల్ తో సత్కరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రాధరాణి, తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ ,వడ్నాల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.