రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగ వర్గం లో పెద్దిరెడ్డి భూంరెడ్డి, జూనియర్ అసిస్టెంట్,కొండం శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కె.మంగమ్మ, స్వీపర్ నారవేని కిషన్ స్వీపర్ విధులు నిర్వర్తిస్తూ ఈరోజు పదవీవిరమణ పొందారు.
ఈ సందర్భంగా వారిని ఈఓ వినోద్ రెడ్డి శాలువతో సత్కరించారు.అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో
ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మొదటగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఏ ఈ ఓ లు శ్రావణ్, జయకుమారి, శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు పదవీవిరమణ చెందిన ఉద్యోగులకు శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.







