రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధపడగా చార్జీలు పెంచొద్దని బీఆర్ ఎస్ పార్టీ నిరసన తెలిపి పెంచకుండా నిలుపుదల చేసినందుకు కృషి చేసిన కేసిఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞత తెలుపుతూ క్షీరాభిషేకం చేశామని మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బుధవారం స్థానిక పాత బస్టాండ్ లో మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి ఆధ్వర్యంలో కేసిఆర్ కేటీఆర్ చిత్రపటాలను ఏర్పాటు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నిరంతరం అండగా ఉంటామని ధరలను పెంచి రాష్ట్ర ప్రజలపై భారం పడితే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్లు కొండ రమేష్ గౌడ్, అందే సుభాష్ ,గుల్లపల్లి నరసింహారెడ్డి ,మాజీ ఎంపిటిసిలు ఎలగందుల నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి , ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, సింగారపు మధు, మాజీ కో ఆప్షన్స్ సభ్యులు మహమ్మద్ జబ్బార్, నాయకులు అందే సురేష్, సింగారం దేవరాజు, కొర్రి అనిల్ ,నాగరాజు,జుబైర్ తదితరులు పాల్గొన్నారు.







