అక్రమంగా అమెరికాలో నివాసం... భారతీయులకు షాకిచ్చిన అగ్రరాజ్యం

అమెరికా ( America )వెళ్లాలని అక్కడి స్థిరపడి డాలర్స్ సంపాదించాలనే కల భారతీయుల్లో నానాటికీ పెరుగుతోంది.చట్టప్రకారం అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు మన పిల్లలు వెనుకాడటం లేదు.

 Us Govt Deports Batch Of Indian Nationals Staying Illegally In Us , America, Us-TeluguStop.com

ఇలాంటి సాహసాలు అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.ఈ ప్రయత్నంలో ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.

ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

ఇటువంటి వ్యక్తుల బలహీనతలను అదనుగా చేసుకుని ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి.అమెరికాకు చేరుస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు.

Telugu America, Officials, Indians, Batchindian, Customs-Telugu NRI

తాజాగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది.చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వీరిని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఛార్టర్డ్ ఫ్లైట్‌ను వినియోగించినట్లుగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ( US Department of Homeland Security )(డీహెచ్ఎస్) శుక్రవారం తెలిపింది.అయితే ఎంత మందిని విమానంలో తిరిగి భారత్‌కు పంపించారన్నది మాత్రం తెలియరాలేదు.

Telugu America, Officials, Indians, Batchindian, Customs-Telugu NRI

అమెరికాలో ఉండటానికి చట్టపరమైన ఆధారాలు , పత్రాలు లేని భారతీయులను వెనక్కి పంపుతున్నట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ( US Immigration and Customs Enforcement )(ఐసీఈ) తెలిపింది.అక్రమ వలసలను తగ్గించడానికి, మానవ అక్రమ రవాణాను ఎదుర్కొవడానికి భారత ప్రభుత్వం, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది.కెనడా, మెక్సికోల నుంచి ప్రతి ఏటా వేలాదిమంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు 1,60,000 మంది వ్యక్తులను అమెరికా బహిష్కరించింది.ఇందులో భారత్ సహా 145 దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇందుకోసం 500కు పైగా ప్రత్యేక విమానాలను నడిపినట్లుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube