షర్మిల వ్యవహారం పై టెలికాన్ఫరెన్స్ 'సజ్జల ' సంచలన వ్యాఖ్యలు 

వైసిపి అధినేత జగన్( YCP chief Jagan ) కు తన ప్రధాన రాజకీయ శత్రువులైన టిడిపి , జనసేన అధినేతల కంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు , తన సోదరి షర్మిల( Sharmila ) తో ఏర్పడిన వ్యక్తిగత , ఆస్తుల పంపకాల వ్యవహారం తలనొప్పిగా మారింది .ఇప్పటికే ఇద్దరి మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది.

 Teleconference 'sajjala' Sensational Comments On Sharmila's Affair , Sajjala Ram-TeluguStop.com

తాజాగా జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేయగా, వైసీపీ నేతలు వాటిని ఖండిస్తూ షర్మిలపై విమర్శలు చేస్తున్నారు.వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలను షర్మిల ఖండిస్తూనే జగన్ పైన , ఆ పార్టీ నాయకుల పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

  ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని,  ఎంపీ వైవి సుబ్బారెడ్డి షర్మిల వ్యవహారంపై కామెంట్స్ చేయగా,  సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి సంచలన విమర్శలు చేశారు.

Telugu Chandrababu, Kethi, Pavan Kalyan, Ys Sharmila, Yvsubba-Politics

  తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ కీలక నేతల రామకృష్ణారెడ్డి స్పందించారు .షర్మిల వ్యవహారంలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన విషయాల పైన పార్టీ శ్రేణులకు ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ మేరకు పార్టీ నాయకులు,  శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్  నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )ఈ వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.‘ రక్తం పంచుకు పుట్టిన చెల్లిపై  ప్రేమాభిమానాలతో జగన్ తన సొంత ఆస్తుల్లోనూ వాటా ఇస్తామని అన్నారని , కానీ గిఫ్ట్ డిడ్ ను షర్మిల దుర్వినియోగం చేశారని , తల్లి పేరిట షేర్లు మార్చాలని చూసారని సజ్జల విమర్శించారు.ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్ద ఉన్నాయని తెలిసి,  అవి పోయాయని అబద్ధాలు ఆడారని సజ్జల అన్నారు.

Telugu Chandrababu, Kethi, Pavan Kalyan, Ys Sharmila, Yvsubba-Politics

  షర్మిల చేసిన చట్ట విరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.  సరస్వతి పవర్ షేర్ల ( Saraswati Power Shares )వ్యవహారం హైకోర్టులో ఉందని , ఈడి అటాచ్ చేసిన ఆస్తులపై స్టేటస్ కో మెయింటైన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని సజ్జల తెలిపారు.ఈడి అటాచ్మెంట్ లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు అని అన్నారు .వాటిని ఆపాలంటూ జగన్ ఎన్ సి ఎల్ టి లో పిటిషన్ ఇచ్చారే తప్ప,  ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదు అని , సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా షర్మిల కుయుక్తులు పన్నారని,  జగన్ ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారని సజ్జల పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.ఈ విషయం తెలిసిన వెంటనే షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని దాన్ని ఆపాలంటూ చెల్లికి జగన్ లేక రాశారని , కానీ ఆమె ఒప్పుకోకపోవడంతోనే న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నారని,  ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube