షర్మిల వ్యవహారం పై టెలికాన్ఫరెన్స్ ‘సజ్జల ‘ సంచలన వ్యాఖ్యలు 

వైసిపి అధినేత జగన్( YCP Chief Jagan ) కు తన ప్రధాన రాజకీయ శత్రువులైన టిడిపి , జనసేన అధినేతల కంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు , తన సోదరి షర్మిల( Sharmila ) తో ఏర్పడిన వ్యక్తిగత , ఆస్తుల పంపకాల వ్యవహారం తలనొప్పిగా మారింది .

ఇప్పటికే ఇద్దరి మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది.తాజాగా జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేయగా, వైసీపీ నేతలు వాటిని ఖండిస్తూ షర్మిలపై విమర్శలు చేస్తున్నారు.

వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలను షర్మిల ఖండిస్తూనే జగన్ పైన , ఆ పార్టీ నాయకుల పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

  ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని,  ఎంపీ వైవి సుబ్బారెడ్డి షర్మిల వ్యవహారంపై కామెంట్స్ చేయగా,  సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి సంచలన విమర్శలు చేశారు.

"""/" /   తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ కీలక నేతల రామకృష్ణారెడ్డి స్పందించారు .

షర్మిల వ్యవహారంలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన విషయాల పైన పార్టీ శ్రేణులకు ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు పార్టీ నాయకులు,  శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్  నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )ఈ వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

' రక్తం పంచుకు పుట్టిన చెల్లిపై  ప్రేమాభిమానాలతో జగన్ తన సొంత ఆస్తుల్లోనూ వాటా ఇస్తామని అన్నారని , కానీ గిఫ్ట్ డిడ్ ను షర్మిల దుర్వినియోగం చేశారని , తల్లి పేరిట షేర్లు మార్చాలని చూసారని సజ్జల విమర్శించారు.

ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్ద ఉన్నాయని తెలిసి,  అవి పోయాయని అబద్ధాలు ఆడారని సజ్జల అన్నారు.

"""/" /   షర్మిల చేసిన చట్ట విరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

  సరస్వతి పవర్ షేర్ల ( Saraswati Power Shares )వ్యవహారం హైకోర్టులో ఉందని , ఈడి అటాచ్ చేసిన ఆస్తులపై స్టేటస్ కో మెయింటైన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని సజ్జల తెలిపారు.

ఈడి అటాచ్మెంట్ లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు అని అన్నారు .

వాటిని ఆపాలంటూ జగన్ ఎన్ సి ఎల్ టి లో పిటిషన్ ఇచ్చారే తప్ప,  ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదు అని , సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా షర్మిల కుయుక్తులు పన్నారని,  జగన్ ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారని సజ్జల పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయం తెలిసిన వెంటనే షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని దాన్ని ఆపాలంటూ చెల్లికి జగన్ లేక రాశారని , కానీ ఆమె ఒప్పుకోకపోవడంతోనే న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నారని,  ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది…ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను: సాయి పల్లవి