ఇక దేవర సినిమాతో( Devara ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తుందనే అంచనాలో ఉన్నారు.ఇక ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తు ముందుకు సాగుతున్నప్పటికీ అందులో జాన్వి కపూర్ క్యారెక్టర్జేషన్ ఎంతమందికి నచ్చింది.
ఆమె చూపించిన అభినయం ఎలా ఉంది.ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది.
అలాగే ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతవరకు కలిసి వస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నప్పటికి ఇందులో ఉన్న రెండు క్యారెక్టర్ లలో కూడా తను చాలా బాగా నటించి మెప్పించాడు.మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ కి అయితే ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి.ఎందుకంటే తెలుగులో మొదటి సినిమాతోనే స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇక తనకు ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా మొదటి సినిమా విషయంలో అంత మంచి ఆఫర్ అయితే రాదు.మరి తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ఇదే కావడంతో ఈ సినిమా మీద అలాగే ఆమె అభినయం మీద ప్రతి ఒక్కరు చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని బాగా ఇచ్చి ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించిందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.మరి మొత్తానికైతే జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాగా వెయ్యబోతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ అమ్ముడు రామ్ చరణ్ తో( Ram Charan ) ఒక సినిమాకి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధించాలని ఆమె కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.