మంత్రి పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

కాంగ్రెస్ కేలకనేత , తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) నివాసం , కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( Enforcement Directorate ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీ నుంచి వచ్చిన 16 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈరోజు తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడి బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి .ఇక పొంగులేటి అనుచరులకు సంబంధించిన నివాసాలు , కార్యాలయాల్లోనూ ఈడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత,  మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో ఈడి  అధికారులు దాడులు నిర్వహించడం ఇది రెండోసారి.

 Ed Raids On Minister Ponguleti Srinivas Reddy House Details, Brs, Bjp, Congress,-TeluguStop.com

  గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు.ఇప్పుడు మరోసారి ఆయన నివాసం పై ఈడి అధికారులు దాడులు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంసంగా  మారింది.

Telugu Congress, Ed Rides, Harsha Reddy, Khammal, Ponguleti Ed, Ponguletiharsha,

ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి( Harsha Reddy ) వాచీల స్మగ్లింగ్ కేసులో ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.ఈ  నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు నివాసంలోనూ కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు .ఆయన కుమారుడు హర్ష రెడ్డి 1 7 కోట్లు విలువ గల వాచీల స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రెండు అత్యంత ఖరీదైన వాచేలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వాచీలను మహమ్మద్ పహిరుద్దీన్ సుబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్ లోకి తీసుకు వచ్చినట్లుగా విచారణలో గుర్తించారు.

Telugu Congress, Ed Rides, Harsha Reddy, Khammal, Ponguleti Ed, Ponguletiharsha,

ఇప్పటికే ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్నూ ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా,  నవీన్ కుమార్ అనే వ్యక్తి కోసం వీటిని తీసుకు వచ్చినట్లు చెప్పారు.  దీంతో నవీన్ కుమార్ ను విచారణ చేయగా అతను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి పేరును చెప్పారు.హర్ష రెడ్డి కోసం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఈ వాచీలను తెప్పించినట్లు కష్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  హవాలా మార్గంలో ఇందుకు డబ్బులు చెల్లించినట్లు కష్టమ్స్ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు పొంగులేటి నివాసం,  కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube